దెబ్బతిన్న పంటలపై సర్వే చేయండి: జేడీఏ
ABN , First Publish Date - 2021-11-22T05:28:04+05:30 IST
ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటల నష్టాన్ని అంచనా వేయాలని జేడీఏ వరలక్ష్మి అన్నారు.

వెల్దుర్తి, నవంబరు 21: ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటల నష్టాన్ని అంచనా వేయాలని జేడీఏ వరలక్ష్మి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని చెరుకులపాడులో దెబ్బతిన్న వరి పంటను పరిశీలించారు. అనంతరం ఆమె ఆయా ఆర్‌బీకే కేంద్రాల సిబ్బందికి ప్రతి గ్రామంలో పర్యటించి దెబ్బతిన్న పంటలను గుర్తించి వెంటనే జరిగిన నష్టాన్ని ఉన్నతాధికారులకు నివేదికలు అందజేయాలని తెలిపారు. జేడీఏ వరలక్ష్మి వెంట ఏడీఏ అశోక్‌వర్దన్ రెడ్డి, ఏవో రవిప్రకాష్, వ్యవసాయశాఖ సిబ్బంది, రైతులు ఉన్నారు.