మిర్చి రైతులను ఆదుకోవాలి: తిక్కారెడ్డి
ABN , First Publish Date - 2021-10-30T04:38:27+05:30 IST
మిర్చి రైతులను ఆదుకోవాలని టీడీ పీ మంత్రాలయం ఇన్‌చార్జి పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు.
పెద్దకడుబూరు, అక్టోబరు 29: మిర్చి రైతులను ఆదుకోవాలని టీడీ పీ మంత్రాలయం ఇన్‌చార్జి పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. శుక్రవారం పెద్దకడుబూరులో తెలుగు రైతు రాష్ట్ర నాయకుడు నరవ రమాకాంతరెడ్డిని తిక్కారెడ్డి, శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు నష్టపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని విమర్శించారు. ఎకరాకు రూ.60 వేలకు పైగా పెట్టుబడి పెట్టి మిరప సాగు చేస్తే వైరస్ సోకి ఎండిపోయిందన్నారు. నష్టపోయిన రైతులకు వెంటనే ప్రభుత్వ ఎకరాకు రూ.లక్ష ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నాయకులు బసలదొడ్డి ఈరన్న, ఆంజనేయులు, ఏసేపు, దశరథ్, రాముడు, వీరేష్‌గౌడ్, చంద్ర, ఉరుకుందు, యంకన్న పాల్గొన్నారు.