విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి

ABN , First Publish Date - 2021-02-08T05:52:15+05:30 IST

మండలంలోని దుద్ది గ్రామానికి చెందిన గొర్లి బాలయ్య, అంజినమ్మ కుమారుడు గొర్లి శ్రీరాములు (12) విద్యుదా ఘాతంతో మృతిచెందాడు.

విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి


కోసిగి, ఫిబ్రవరి 7:
మండలంలోని దుద్ది గ్రామానికి చెందిన గొర్లి బాలయ్య, అంజినమ్మ కుమారుడు గొర్లి శ్రీరాములు (12) విద్యుదా ఘాతంతో మృతిచెందాడు. వివరాల మేరకు.. శ్రీరాములు స్థానిక పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. ఆదివారం బంధువులు నిర్మి స్తున్న ఇంటికి క్యూరింగ్‌ చేసిన అనంతరం మోటర్‌ ఆఫ్‌ చేయడానికి వెళ్లి విద్యుదా ఘాతంతో మృతి చెందాడు.

Updated Date - 2021-02-08T05:52:15+05:30 IST