వేతన సవరణ ఊసేలేదు: ఎస్టీయూ

ABN , First Publish Date - 2021-05-21T05:01:50+05:30 IST

బడ్జెట్‌లో వేతన సవరణపై ప్రభుత్వం స్పష్టత ఇస్తుందని ఉద్యోగులు ఆశించారని, అయితే ఆ ఊసేలేకుండా బడ్జెట్‌ తీసుకొచ్చారని ఎస్టీయూ రాష్ట్ర పురపాలక కన్వీనర్‌ నాగరాజు విమర్శించారు.

వేతన సవరణ ఊసేలేదు: ఎస్టీయూ

ఆదోని(అగ్రికల్చర్‌), మే 20: బడ్జెట్‌లో వేతన సవరణపై ప్రభుత్వం స్పష్టత ఇస్తుందని ఉద్యోగులు  ఆశించారని, అయితే ఆ ఊసేలేకుండా బడ్జెట్‌ తీసుకొచ్చారని  ఎస్టీయూ రాష్ట్ర పురపాలక కన్వీనర్‌ నాగరాజు విమర్శించారు.  ఎస్టీయూ కార్యాలయంలో గురువారం కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేతన సవరణకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని ఎంతో ఆశతో ఎదురు చూసిన ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు నిరాశే మిగిలిందని అన్నారు. సమావేశంలో నాయకులు వీరచంద్రయాదవ్‌ రవి, జంబులయ్య, భాస్కరచారి, వెంకటరెడ్డి, నాగేంద్రగౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-05-21T05:01:50+05:30 IST