గృహ నిర్మాణాలు ప్రారంభించండి

ABN , First Publish Date - 2021-06-23T05:04:54+05:30 IST

హౌసింగ్‌ లే అవుట్లలో గృహనిర్మాణాలను త్వరగా ప్రారంభించాలని జేసీ మౌర్య అధికారులను ఆదేశించారు. పట్టణంలో హౌసింగ్‌ లే అవుట్లను ఆమె మంగళవారం పరిశీలించారు.

గృహ నిర్మాణాలు ప్రారంభించండి

  1.  లే అవుట్‌లను పరిశీలించిన జేసీ మౌర్య 


నందికొట్కూరు, జూన్‌ 22: హౌసింగ్‌ లే అవుట్లలో గృహనిర్మాణాలను త్వరగా ప్రారంభించాలని జేసీ మౌర్య అధికారులను ఆదేశించారు. పట్టణంలో హౌసింగ్‌ లే అవుట్లను ఆమె మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లే అవుట్లలో రోడ్లు చిన్న ఉండటంపై ఆమె ఆరా తీశారు. మున్సిపాలిటీల్లో రోడ్ల కొలతలు ఎలా వేస్తారని కమిషనర్‌ అంకిరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. జిల్లా అంతటా రోడ్ల కొలతల గురిచిన వివరాలు తనకు ఇవ్వాలని జేసీ ఆదేశించారు. ఈ ఈ కార్యక్రమంలో హౌసింగ్‌ పీడీ వెంకటనారాయణ, కమిషనర్‌ అంకిరెడ్డి, డీఈ ప్రభాకర్‌ పాల్గొన్నారు. 

పగిడ్యాల: ఇళ్లు లేని నిరుపేదలకు ప్రభుత్వం ఇంటి స్థలాలు కేటాయించి గృహనిర్మాణాలు చేపడుతుందని, లబ్ధిదారులు గృహ నిర్మాణాలను త్వరితగతిన చేపట్టాలని హౌసింగ్‌ జాయింట్‌ కలెక్టర్‌ ఎన్‌. మౌర్య అన్నారు. మండల పరిధిలోని ప్రాతకోట గ్రామంలోని జగన్నన కాలనీలను మంగళవారం జాయింట్‌ కలెక్టర్‌ పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. గ్రామంలో ఎంత మందికి గృహాలు మంజూరయ్యాయని హౌసింగ్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్‌ పీడీ వెంకటనారాయణ, ఈఈ నాగరాజు, డీఈ ప్రభాకర్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-06-23T05:04:54+05:30 IST