వైభవంగా శ్రీగిరి ప్రదక్షిణ
ABN , First Publish Date - 2021-02-27T05:03:25+05:30 IST
శ్రీశైలంక్షేత్రంలో మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని శుక్రవారం దేవస్థానం గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.

శ్రీశైలం, ఫిబ్రవరి 26: శ్రీశైలంక్షేత్రంలో మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని శుక్రవారం దేవస్థానం గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం స్వామిఅమ్మవార్ల మహా మంగళ హారతుల అనంతరం స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో ఆశీనులనుజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామిఅమ్మవార్ల పల్లకి ఊరేగింపును ఆలయ మహద్వారం నుంచి ప్రాంభించి గంగాధరమండపం, అంకాలమ్మగుడి, నందిమండపం, గంగాసదనం, బయలు వీరభద్రస్వామి ఆలయం, వలయరహదారిమీదుగా సిద్ధరామప్పకొలను, పుస్కరివద్దకు చేరుకుంటుంది. తిరిగి నంది మండపం నుంచి ఆలయ మహద్వారం వద్దకు చేరుకోవడంతో గిరిప్రదక్షిణ ముగుస్తుంది. గిరి ప్రదక్షిణ అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు.