స్పిల్‌వే గేట్ల లీకేజీని అరికట్టాలి:ఎమ్మెల్సీ

ABN , First Publish Date - 2021-11-06T04:33:04+05:30 IST

అవుకు రిజర్వాయరులో అంతర్భాగమైన స్పిల్‌వే గేట్ల లీకేజీని అరికట్టాలని ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి ఎస్సా ర్బీసీ అధికారులకు సూచించారు.

స్పిల్‌వే గేట్ల లీకేజీని అరికట్టాలి:ఎమ్మెల్సీ

అవుకు, నవంబరు 5: అవుకు రిజర్వాయరులో అంతర్భాగమైన స్పిల్‌వే గేట్ల లీకేజీని అరికట్టాలని ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి ఎస్సా ర్బీసీ అధికారులకు సూచించారు. శుక్రవారం అవుకు పట్టణంలోని చల్లాభవనలో ఎంపీపీ చల్లా రాజశేఖర్‌రెడ్డి, ఎస్సార్బీసీ ఈఈ వెంకట సురేష్‌బాబు, డీఈ బాబ్జి, ఏఈఈఎస్‌ విఽధూషమణి, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ చల్లా భగీర థరెడ్డి మాట్లాడుతూ స్పిల్‌వే 5వ గేటు లీకేజీతో వంద క్యూసెక్కుల నీరు వృధాగా పోతుందన్నారు. అలాగే ఓబుళాపురం కాలువ వంతెన సమస్యను పరిష్కరిస్తామని రైతుల కు హామీ ఇచ్చారు.    


Updated Date - 2021-11-06T04:33:04+05:30 IST