సుబ్రహ్మణ్య స్వామికి విశేష పూజలు

ABN , First Publish Date - 2021-11-03T05:08:41+05:30 IST

శ్రీశైల క్షేత్రంలో లోకకళ్యాణం కోసం మంగళవారం ఆలయ ప్రాంగణంలో ఉన్న సుబ్రహ్మణ్య (కుమార స్వామి), బయలు వీరభద్ర స్వామికి, నందీశ్వరుడికి విశేష అభిషేకం, అర్చనలు చేశారు.

సుబ్రహ్మణ్య స్వామికి విశేష పూజలు

శ్రీశైలం, నవంబరు 2: శ్రీశైల క్షేత్రంలో లోకకళ్యాణం కోసం మంగళవారం ఆలయ ప్రాంగణంలో ఉన్న సుబ్రహ్మణ్య (కుమార స్వామి), బయలు వీరభద్ర స్వామికి, నందీశ్వరుడికి విశేష అభిషేకం, అర్చనలు చేశారు. ముందుగా పూజా కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతికి పూజలు చేశారు. అనంతరం పంచామృతాలతో అభిషేకం నిర్వహించి, మంగళ హారతులు జరిపారు. శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న నిత్యకళారాధన కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఎం.రమణయ్య భాగవ తార్‌, పార్వతి నగర్‌, కడప జిల్లా వారిచే భూ కైలాస్‌ హరికథ కార్యక్రమం నిర్వహించారు. నిత్య కళారాధన వద్ద సాయంత్రం భరత నాట్య ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అలాగే నిత్య కళారాధనలో భాగంగా ప్రతి రోజూ హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తి రంజని వంటి కార్యక్రమాలు దేవస్థానం ఏర్పాటు చేస్తోంది.

Updated Date - 2021-11-03T05:08:41+05:30 IST