కార్తీకమాసంలో ప్రత్యేక ప్యాకేజీ బస్సు సర్వీసులు

ABN , First Publish Date - 2021-11-06T04:32:13+05:30 IST

కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆత్మకూరు ఆర్టీసీ డిపో పరిధిలో శైవక్షేత్రాలకు ప్రత్యేక ప్యాకేజీ బస్సు సర్వీసును ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్‌ కృష్ణమూర్తి తెలిపారు.

కార్తీకమాసంలో ప్రత్యేక ప్యాకేజీ బస్సు సర్వీసులు


ఆత్మకూరు, నవంబరు 5: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆత్మకూరు ఆర్టీసీ డిపో పరిధిలో శైవక్షేత్రాలకు ప్రత్యేక ప్యాకేజీ బస్సు సర్వీసును ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్‌ కృష్ణమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడుతూ యాగంటి, భోగేశ్వరం, మహానంది, ఓంకారం క్షేత్రాలకు ఆత్మకూరు డిపో నుంచి ప్రతి సోమవారం ఉదయం 6గంటలకు బస్సు సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు వివరించారు. ఆయా క్షేత్రాలను భక్తులు సందర్శించిన అనంతరం తిరిగి రాత్రి 7గంటలకు ఆత్మకూరుకు చేరుకునేలా ప్రత్యేక ప్యాకేజీని ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ ప్యాకేజీ కోసం  స్థానిక బస్టాండ్‌లో అడ్వాన్స రిజర్వేషన సదుపాయాన్ని కల్పించినట్లు తెలిపారు. ఒక్కొక్కరికి రూ.400 టిక్కెట్‌ ధరలను నిర్ణయించినట్లు చెప్పారు. ఏ గ్రామం నుంచైనా 50 మంది భక్తులు వెళ్లేందుకు సిద్ధమైతే వారి గ్రామం నుంచే బస్సు సర్వీసును నడపనున్నట్లు పేర్కొన్నారు. శబరిమల టూరుకు వెళ్లే భక్తుల కోసం డిపో నుంచి ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు. ఈ అవకాశాన్ని ఆత్మకూరు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 


Updated Date - 2021-11-06T04:32:13+05:30 IST