మండలానికో ప్రత్యేక అధికారి నియామకం

ABN , First Publish Date - 2021-02-08T06:11:26+05:30 IST

గ్రామపంచాయతీ ఎన్నికల మొదటి దశలో జరుగనున్న పోలింగ్‌ నిర్వహణ కోసం మండలానికో ప్రత్యేక అధికారిని నియమిస్తూ జాయింట్‌ కలెక్టర్‌ అడిషనల్‌ జిల్లా అథారిటీ రాంసుందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

మండలానికో ప్రత్యేక అధికారి నియామకం

కర్నూలు(కలెక్టరేట్‌), ఫిబ్రవరి 7: గ్రామపంచాయతీ ఎన్నికల మొదటి దశలో జరుగనున్న పోలింగ్‌ నిర్వహణ కోసం మండలానికో ప్రత్యేక అధికారిని నియమిస్తూ జాయింట్‌ కలెక్టర్‌ అడిషనల్‌ జిల్లా అథారిటీ రాంసుందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఆత్మకూరు మండలానికి డి.వాణి( ఏడీ, సెరికల్చర్‌, ఆత్మకూరు), వెలుగోడుకు టి.ధనుంజయుడు (ఏడీ, పశుసంవర్థకశాఖ, వెలుగోడు), నంద్యాలకు సి.వి.రమణయ్య (పశుసంవర్థకశాఖ డీడీ, నంద్యాల), మహానందికి డా.కె.వి.బ్రహ్మం (ఏడీ, పశుసంవర్థకశాఖ, నంద్యాల), బండిఆత్మకూరుకు డి.రాజశేఖర్‌(అగ్రికల్చర్‌ ఏడీ, నంద్యాల), ఆళ్ళగడ్డకు డా.వో నరసంహరావు(పశుసంవర్థకశాఖ డీడీ, ఆళ్లగడ్డ), గోస్పాడుకు బి.వెంకటరమణ (పశుసంవర్థకశాఖ ఏడీ, నంద్యాల), చాగలమర్రికి ఎస్‌.సి.వి. సుబ్బారెడ్డి (పశుసంవర్థకశాఖ, ఏడీ, చాగలమర్రి), రుద్రవరం మండలానికి డా.కె.గిడ్డయ్య, (పశుసంవర్థకశాఖ ఏడీ, రుద్రవరం), శిరివెళ్లకు ఎం.గిరీష్‌ వ్యవసాయశాఖ (ఏడీ, నంద్యాల), దొర్నిపాడు మండలానికి డా.ఎం.వి. వీరప్రసాద్‌ (పశుసంవర్థకశాఖ ఏడీ, ఆళ్లగడ్డ)ప్రత్యేక అధికారులుగా నియమించారు. 

Updated Date - 2021-02-08T06:11:26+05:30 IST