రేపటి నుంచి ప్రత్యేక దర్శనం

ABN , First Publish Date - 2021-12-31T05:48:43+05:30 IST

రాఘవేంద్రస్వామి దర్శనార్థం మంత్రాలయానికి వచ్చే వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ఇకపై ప్రత్యేక దర్శన సౌకర్యం కల్పిస్తామని మఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులు గురువారం తెలిపారు.

రేపటి నుంచి ప్రత్యేక దర్శనం

  1. వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులకు అవకాశం


మంత్రాలయం, డిసెంబరు 30: రాఘవేంద్రస్వామి దర్శనార్థం మంత్రాలయానికి వచ్చే వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ఇకపై ప్రత్యేక దర్శన సౌకర్యం కల్పిస్తామని మఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులు గురువారం తెలిపారు. కొత్త సంవత్సరం నుంచి ముఖద్వారం వద్ద ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేస్తామని అన్నారు. అక్కడ టోకెన్‌ తీసుకుని ఏడో గేటు నుంచి నేరుగా రాఘవేంద్రస్వామి బృందావనం దర్శనానికి వెళ్లవచ్చని తెలిపారు. ఇప్పటి వరకూ అందరికీ ఒకే దర్శనం క్యూలైన్‌లు ఉన్నాయి. దీంతో వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విషయం తెలుసుకున్న పీఠాధిపతి ప్రత్యేక దర్శనం కల్పించేలా చర్యలు తీసుకున్నారని మఠం మేనేజర్‌ వెంకటేష్‌ జోషి, ఐపీ నరసింహమూర్తి, శ్రీహరి ఆచార్‌ తెలిపారు. 

Updated Date - 2021-12-31T05:48:43+05:30 IST