జొన్న కంకులకు నిప్పు

ABN , First Publish Date - 2021-03-22T04:55:22+05:30 IST

మండల పరిధిలోని దుద్యాల గ్రామంలో శనివారం రాత్రి రైతు యోగానం దరెడ్డికి చెందిన జొన్నకంకులను గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించారు.

జొన్న కంకులకు నిప్పు

రూ 2.30 లక్షల ఆస్తి నష్టం

 కొత్తపల్లి, మార్చి 21:
మండల పరిధిలోని దుద్యాల గ్రామంలో శనివారం రాత్రి రైతు యోగానం దరెడ్డికి చెందిన జొన్నకంకులను గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించారు. దీంతో సుమారు రూ2.30 లక్షల నష్టం  జరిగిందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. మూడు ఎకరాలలో సాగు చేసిన జొన్న పంటను కోసి కంకు లను పొలంలో కుప్పగా పోశానని, గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయంలో నిప్పు పెట్టారని తెలిపారు. చేతికి వచ్చిన పంట బూడిద కావడంతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటనా స్థలాన్ని వైసీపీ మండల కన్వీనర్‌ సుధాకర రెడ్డి, సర్పంచ్‌ శోభలత సందర్శించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి రైతులకు నష్టపరిహారం అందేలా చూస్తామని వాహు హామీ ఇచ్చారు.

Updated Date - 2021-03-22T04:55:22+05:30 IST