5 సెంట్ల స్థలం కోసం..

ABN , First Publish Date - 2021-02-05T05:39:22+05:30 IST

మండలంలోని మందలూరు గ్రామానికి చెందిన సంతోషమ్మ అనే వృద్ధురాలిపై 5 సెంట్ల ఇంటి స్థలం కోసం అల్లుడు దాడి చేసినట్లు ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి గురువారం తెలిపారు.

5 సెంట్ల స్థలం కోసం..

రుద్రవరం, ఫిబ్రవరి 4: మండలంలోని మందలూరు గ్రామానికి చెందిన సంతోషమ్మ అనే వృద్ధురాలిపై 5 సెంట్ల ఇంటి స్థలం కోసం అల్లుడు దాడి చేసినట్లు ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి గురువారం తెలిపారు. గ్రామంలో 5 సెంట్ల ఇంటి స్థలం ఇవ్వక పోవడంతో పెద్ద అల్లుడు యోహాన్‌, జాన్సన్‌, రవి దాడి చేశారని వృద్ధురాలు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గాయపడిన వృద్ధురాలిని ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2021-02-05T05:39:22+05:30 IST