‘సోము వీర్రాజు వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి’

ABN , First Publish Date - 2021-12-31T05:20:27+05:30 IST

బీజేపీ అధికారంలోకి వస్తే రూ.50కే చీప్‌ లిక్కర్‌ ఇస్తామన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్‌ ఆదోని డివిజన్‌ అధ్యక్షుడు రామతీర్థం అమరేష్‌ మాదిగ డిమాండ్‌ చేశారు.

‘సోము వీర్రాజు వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి’

ఎమ్మిగనూరు, డిసెంబరు30. బీజేపీ అధికారంలోకి వస్తే రూ.50కే చీప్‌ లిక్కర్‌ ఇస్తామన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్‌ ఆదోని డివిజన్‌ అధ్యక్షుడు రామతీర్థం అమరేష్‌ మాదిగ డిమాండ్‌ చేశారు. గురువారం పట్టణంలోని ఎన్జీవో కార్యాలయంలో ఆయన విలేకరులతో సోము వీర్రాజు వ్యాఖ్యలు దిగజారుడు రాజకీయాలకు సంకేతమన్నారు. రాష్ట్రప్రజలకు కావాల్సింది ప్రత్యేహోదా, కడప స్టీల్‌ప్లాంట్‌, మూలప్రాంత వాసులకు రాజ్యంగ ఫలాలు, జీవనప్రమాణాలతో కూడిన ఆరోగ్యం, నైపుణ్యంతో కూడుకున్న విద్య, నిరుద్యోగులకు ఉపాధి అన్నారు. వీటన్నింటీని వదిలేసి మద్యాన్ని రూ.50కి ఇస్తామని చెప్పటం ఎంతవరకు సమంజసమన్నారు. సమావేశంలో నాయకులు లోకేష్‌ పాల్గొన్నారు.


ఎమ్మిగనూరు టౌన్‌ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఏపీ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఏఐఎస్‌ఎఫ్‌ జాతీయ కార్యదర్శి రంగన్న గురువారం ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ఓటర్లను తాగుబో తులుగా చిత్రీకరిస్తూ వ్యాఖ్యలు చేసిన సోము వీర్రాజును అరెస్టు చేయా లన్నారు. కమ్యూనిస్టులను విమర్శించే స్థాయి ఆయనకు లేదన్నారు.

Updated Date - 2021-12-31T05:20:27+05:30 IST