‘ఇచ్చేది కొంత.. దోచుకునేది కొండంత’

ABN , First Publish Date - 2021-10-08T04:37:23+05:30 IST

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు గోరంత ఇస్తూ కొండంత దోచుకుంటున్నారని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి విమర్శించారు.

‘ఇచ్చేది  కొంత.. దోచుకునేది కొండంత’
మాట్లాడుతున్న బీసీ జనార్దన్‌రెడ్డి

బనగానపల్లె, అక్టోబరు 7: వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు గోరంత ఇస్తూ కొండంత దోచుకుంటున్నారని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి విమర్శించారు. గురువారం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జిల్లా సమన్వయకర్తల సమావేశంలో బీసీ మాట్లాడారు. విద్యుత్‌ చార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి పేద ప్రజల నడ్డివిరిచిందన్నారు. గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడుతున్నారని, పింఛన్లు, రేషన్‌ కార్డులు అర్హులవి తీసివేసి అన్యాయం చేశారన్నారు. ఎక్కడ చూసినా వైసీపీ నాయకుల దౌర్జన్యాలు పెరిగిపోయాయన్నారు. రైతులు, ప్రజలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉందన్నారు. 

Updated Date - 2021-10-08T04:37:23+05:30 IST