రైతు మిత్ర ఏజెన్సీల సీజ్‌

ABN , First Publish Date - 2021-12-25T06:10:33+05:30 IST

మండలంలోని ఉయ్యాలవాడ గ్రామంలో ఉన్న రైతుమిత్ర ఏజెన్సీ మందుల దుకాణాన్ని సీజ్‌ చేశామని వ్యవసాయాధికారులు సుధాకర్‌రెడ్డి, కృష్ణ తెలిపారు.

రైతు మిత్ర  ఏజెన్సీల సీజ్‌

ఉయ్యాలవాడ, డిసెంబరు 24: మండలంలోని ఉయ్యాలవాడ గ్రామంలో ఉన్న రైతుమిత్ర ఏజెన్సీ  మందుల దుకాణాన్ని సీజ్‌ చేశామని వ్యవసాయాధికారులు సుధాకర్‌రెడ్డి, కృష్ణ తెలిపారు. శుక్రవారం దుకాణంలోని మందులను పరిశీలించి 10 రోజుల పాటు లైసెన్స్‌ రద్దు చేసి దుకాణాన్ని సీజ్‌ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డౌ అగ్రి ఏజెన్సీ కంపెనీకి చెందిన డెలికేట్‌ మందుకు బదులుగా నకిలీ మందులు అమ్ముతున్నట్లు  కంపెనీ నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు మందుల దుకాణాన్ని తనిఖీ చేశామని అన్నారు. ఇంజేడు గ్రామానికి చెందిన కాకనూరు పెద్దగుర్రెడ్డి అనే రైతుకు మందుల దుకాణదారులు ఇచ్చిన నకిలీ మందు ఆధారంగా సోదాలు చేశామని అన్నారు. దీనిపై నివేదిక తయారు చేసి కేసు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈవో వెంకటేశ్వర్‌రెడ్డి, వీఏఏలు పాల్గొన్నారు. Updated Date - 2021-12-25T06:10:33+05:30 IST