సచివాలయ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు
ABN , First Publish Date - 2021-10-28T05:41:20+05:30 IST
విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ముగ్గురు సచివాలయ ఉద్యోగులకు బుధవారం షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు ఎంపీడీవో మోహన్‌కుమార్ తెలిపారు.

ఆత్మకూరు రూరల్, అక్టోబరు 27: విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ముగ్గురు సచివాలయ ఉద్యోగులకు బుధవారం షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు ఎంపీడీవో మోహన్‌కుమార్ తెలిపారు. మండలంలోని ముష్టపల్లి గ్రామ వలంటీర్ రేనాటి లక్ష్మీదేవి, సిద్ధ్దాపురం ఇంజనీరింగ్ అసిస్టెంట్ హరిత, పిన్నాపురం గ్రామ ఇంజనీరింగ్ అసిస్టెంట్ శ్రీలక్ష్మిలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు ఎంపీడీవో తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు విధుల్లో అలక్ష్యం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు ప్రతి రోజు తప్పనిసరిగా బయోమెట్రిక్ వేయాలని సూచించారు. విధుల్లో అలసత్వం ప్రదర్శించిన సచివాలయ ఉద్యోగులపై చర్యల నిమిత్తం జాయింట్ కలెక్టర్‌కు విన్నవించనున్నట్లు ఆయన వెల్లడించారు.