షార్ట్‌ సర్క్యూట్‌తో రేకుల షెడ్డు దగ్ధం

ABN , First Publish Date - 2021-04-21T04:58:42+05:30 IST

కోవెలకుంట్ల పట్టణంలోని బస్టాండు సమీపంలో ఉన్న ఇందిరానగర్‌ కాలనీలో మంగళవారం రేకులషెడ్డు దగ్ధమైంది.

షార్ట్‌ సర్క్యూట్‌తో రేకుల షెడ్డు దగ్ధం



కోవెలకుంట్ల, ఏప్రిల్‌ 20:
  కోవెలకుంట్ల పట్టణంలోని బస్టాండు సమీపంలో ఉన్న ఇందిరానగర్‌ కాలనీలో మంగళవారం  రేకులషెడ్డు దగ్ధమైంది. దీంతో  రూ.80వేలు ఆస్తినష్టం వాటిల్లినట్లు బాధితురాలు రమణమ్మ తెలిపింది. పట్టణంలోని ఇందిరానగర్‌ కాలనీలో రేకులషెడ్డులో గత కొన్నేళ్లుగా అద్దెకు ఉంటూ బస్టాండు ప్రాంగణంలో బండిపై పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తుండేది.  మంగళవారం కూడా ఉదయం పనులు ముగించుకొని యఽథావిధిగా బస్టాండుకు వ్యాపారం చేసుకొనేందుకు వచ్చింది. ప్రమాదవశాత్తు రేకులషెడ్డులో మంటలు చెలరేగాయి. అందులో ఉన్న  రూ.50వేల విలువైన మామిడి పండ్లు, టీవీ, వంట సామగ్రి, నిత్యావసరాలు, రూ.30వేల నగదు కాలిబూడిదయ్యాయి. ప్రభుత్వం ఆర్థికసాయం అందించి  ఆదుకోవాలని బాధితురాలు కోరారు.  స్థానిక వీఆర్వోలు ప్రసాద్‌, సంజీవరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Updated Date - 2021-04-21T04:58:42+05:30 IST