గ్యాస్‌ సిలిండర్‌ లీకై ఇద్దరికి తీవ్ర గాయాలు

ABN , First Publish Date - 2021-10-08T05:02:12+05:30 IST

మండల కేంద్రమైన గోనెగండ్లలో కొండ వీధిలో గురువారం సాయంత్రం ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ లీకై ముగ్గురికి గాయాలయ్యాయి.

గ్యాస్‌ సిలిండర్‌ లీకై  ఇద్దరికి తీవ్ర గాయాలు

గోనెగండ్ల, అక్టోబరు 7: మండల కేంద్రమైన గోనెగండ్లలో కొండ వీధిలో గురువారం సాయంత్రం ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ లీకై ముగ్గురికి గాయాలయ్యాయి. అందులో మౌలాలి, అరవింద్‌కు తీవ్రగాయాలు కాగా శోభకు స్వల్ప గాయాలయ్యాయి. మౌలాలి, ఆయన  కుటుంబ సభ్యులతో ఉదయం పొలం పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చారు.  ప్రమాదవశాత్తు గ్యాస్‌ సిలిండర్‌ గ్యాస్‌ లీక్‌ అయింది. కుటుంబ సభ్యులు ఇది గమనించలేదు. వాకిలి దగ్గర మౌలాలి బీడీ తాగేందుకు అగ్గి పుల్ల ముట్టించాడు. దీంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. బాధితులకు గోనెగండ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేసిన అనంతరం వారిని కర్నూలు అసుపత్రికి తరలించారు. 

Updated Date - 2021-10-08T05:02:12+05:30 IST