సీనియర్‌ అసిస్టెంట్లకు పదోన్నతి

ABN , First Publish Date - 2021-01-13T05:47:47+05:30 IST

వైద్య ఆరోగ్యశాఖ కడప జోన్‌ పరిధిలో పని చేస్తున్న 13 మంది సీనియర్‌ అసిస్టెంట్‌లకు ఆఫీస్‌ సూప రింటెండెంట్లుగా పదోన్నతి లభించింది.

సీనియర్‌ అసిస్టెంట్లకు పదోన్నతి

కర్నూలు(హాస్పిటల్‌), జనవరి 12: వైద్య ఆరోగ్యశాఖ కడప జోన్‌ పరిధిలో పని చేస్తున్న 13 మంది సీనియర్‌ అసిస్టెంట్‌లకు ఆఫీస్‌ సూప రింటెండెంట్లుగా పదోన్నతి  లభించింది.  సోమవారం కడప రీజినల్‌ డైరెక్టర్‌ డా.వీణాకుమారి పదోన్నతులు కౌన్సిలింగ్‌ను నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో పనిచేస్తున్న బి.కుమార స్వామి కర్నూలు మెడికల్‌ కాలేజ్‌లో పని చేస్తున్న హరిశంకర్‌ పదోన్నతి పొందారు. ఆఫీసులో బి.కుమారస్వామి, కేఎంసీలో హరిశంకర్‌కు పోస్టింగ్‌లు వేస్తూ రీజినల్‌ డైరెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. మంగళశారం వీరు బాధ్యతలు చేపట్టారు. యూనియన్‌ నాయకులు కొత్త సూపరింటెండెంట్లకు శుభాకాంక్ష లు తెలిపారు. 


Updated Date - 2021-01-13T05:47:47+05:30 IST