సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-06-23T05:28:10+05:30 IST

బిణిగేరి సచివాలయ ఏఎన్‌ఎం కవిత (27) తుగ్గలి సమీపంలో రైలుకింద పడి సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది.

సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య

తుగ్గలి, జూన్‌ 22: బిణిగేరి సచివాలయ ఏఎన్‌ఎం కవిత (27) తుగ్గలి సమీపంలో రైలుకింద పడి సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. గుంతకల్లు రైల్వే ఎస్‌ఐ రమణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంతకల్లుకు తరలించారు. ములుగుందం గ్రామానికి చెందిన కవితను విరుపాపురం గ్రామానికి చెందిన వీరాచారికి ఇచ్చి తొమ్మిదేళ్ల క్రితం వివాహం చేశారని, ఆమెకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారని ఎస్‌ఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.

Updated Date - 2021-06-23T05:28:10+05:30 IST