నామినేషన్లు ఇలా..!

ABN , First Publish Date - 2021-02-05T05:45:02+05:30 IST

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఆఖరి రోజు గురువారం బనగానపల్లె మండలంలో సర్పంచ్‌, వార్డు సభ్యుల నామినేషన్ల దాఖలు ముగిసింది.

నామినేషన్లు ఇలా..!

బనగానపల్లె, ఫిబ్రవరి 4: గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఆఖరి రోజు గురువారం బనగానపల్లె మండలంలో సర్పంచ్‌, వార్డు సభ్యుల నామినేషన్ల దాఖలు ముగిసింది. మూడు రోజులకు మొత్తం 157 మంది సర్పంచ్‌ స్థానాలకు, 723 మంది వార్డు సభ్యులకు నామినేషన్లు దాఖలు చేశారు. మండలంలో మొత్తం 24 గ్రామ సర్పంచ్‌ స్థానాలకు 94 మంది, 262 వార్డు సభ్యులకు గాను 400 మంది మంది నామినేషన్‌ పత్రాలను గురువారం దాఖలు చేసినట్లు మండల ఎన్నికల అధికారి నాగప్రసాద్‌ తెలిపారు. అప్పలాపురంలో సర్పంచ్‌ స్థానానికి 6 మంది, వార్డు సభ్యులకు 20 మంది, బనగానపల్లెలో సర్పంచ్‌ స్థానానికి 9మంది, వార్డు సభ్యులకు 105 మంది నామినేషన్‌ వేసినట్లు తెలిపారు. బీరవోలులో సర్పంచ్‌ స్థానానికి 3, వార్డు సభ్యులకు 27, చెర్వుపల్లె గ్రామ సర్పంచ్‌ స్థానానికి 4, వార్డు సభ్యులకు 36, గులాం అలియాబాద్‌తండా సర్పంచ్‌ స్థానానికి 6, వార్డు స్థానాలకు 17 నామినేషన్లు వచ్చినట్లు అధికారి తెలిపారు. ఇల్లూరుకొత్తపేట సర్పంచ్‌ స్థానానికి 9మంది, వార్డు స్థానానికి 26 మంది, క్రిష్ణగిరి సర్పంచ్‌ స్థానానికి ఏడుగురు, వార్డు స్థానాలకు 18 మంది, కైప సర్పంచ్‌ స్థానానికి 13 మంది, వార్డు స్థానాలకు 39 మంది, మీరాపురం సర్పంచ్‌ స్థానానికి ఐదుగురు, వార్డు స్థానాలకు 20 మంది నామినేషన్‌ వేశారన్నారు. మిట్టపల్లె సర్పంచ్‌ స్థానానికి 8మంది, వార్డు స్థానాలకు 23 మంది, నందవరం సర్పంచ్‌ స్థానానికి 4, వార్డు స్థానాలకు 44 మంది, నందివర్గం సర్పంచ్‌ స్థానానికి నలుగురు, వార్డు స్థానాలకు 32 మంది నామినేషన్‌ దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారి నాగప్రసాద్‌ తెలిపారు. పలుకూరు సర్పంచ్‌ స్థానానికి ఆరుగురు, వార్డు స్థానాలకు 53 మంది, పసుపల సర్పంచ్‌ స్థానానికి 9 మంది, వార్డు స్థానాలకు 18 మంది, పాతపాడు సర్పంచ్‌ స్థానానికి ఏడుగురు, వార్డు స్థానాలకు 36 మంది, రామతీర్థం సర్పంచులకు 6, వార్డులకు 22 మంది, రామకృష్ణాపురం సర్పంచ్‌ స్థానాలకు నలుగురు, వార్డు స్థానాలకు 28 మంది నామినేషన్‌ వేసినట్లు తెలిపారు. టంగుటూరు సర్పంచ్‌ స్థానానికి ఏడుగురు, వార్డు స్థానాలకు 27 మంది, తమ్మడపల్లె సర్పంచ్‌ స్థానానికి 12 మంది, వార్డు స్థానాలకు 22 మంది, తిమ్మాపురం సర్పంచ్‌ స్థానాలకు నలుగురు, వార్డు స్థానాలకు 10 మంది, వెంకటాపురం సర్పంచ్‌ స్థానానికి నలుగురు, వార్డు స్థానాలకు 20 మంది, యాగంటిపల్లె సర్పంచ్‌ స్థానాలకు 10 మంది, వార్డు స్థానాలకు 21 మంది నామినేషన్‌ వేశారన్నారు. యనకండ్ల సర్పంచ్‌ స్థానానికి ఐదుగురు, వార్డు స్థానాలకు 32 మంది, యర్రగుడి సర్పంచ్‌ స్థానానికి ఐదుగురు, వార్డు స్థానాలకు 27 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు మండల ఎన్నికల అధికారి తెలిపారు. 


కోవెలకుంట్ల: రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం సాయంత్రం ప్రశాంతంగా ముగిసినట్లు ఎంపీడీవో మహబూబ్‌దౌలా, ఈవోఆర్డీ ప్రకాష్‌నాయుడు తెలిపారు. వారు మాట్లాడుతూ మండలంలో మొత్తం 17 గ్రామ పంచాయతీలకు సర్పంచ్‌, వార్డు మెంబర్లకు నామినేషన్ల ప్రక్రియ పూర్తయినట్లు తెలిపారు. మూడు రోజుల్లో కలిపి 110 మంది సర్పంచ్‌కు స్థానాలకు నామినేషన్లు వేశారు. వార్డు మెంబర్లకు 404 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. అమడాల పంచాయతీకి నలుగురు, వార్డు స్థానాలకు 30, భీమునిపాడు సర్పంచ్‌ స్థానానికి 10, వార్డు స్థానాలకు 20, బిజినవేముల సర్పంచ్‌కు 5, వార్డుస్థానాలకు 27 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. చిన్నకొప్పెర్ల సర్పంచ్‌కు 10, వార్డు స్థానాలకు 12, గుంజలపాడు సర్పంచ్‌కు 6, వార్డులకు 12, గుళ్లదుర్తి సర్పంచ్‌కు 6, వార్డు స్థానాలకు 30, జొళదరాశి సర్పంచ్‌ స్థానానికి 6, వార్డులకు 16 నామినేషన్లు వేశారన్నారు. కలుగొట్లలో సర్పంచ్‌ పదవికి 5, వార్డులకు 25, కంపమల్ల సర్పంచ్‌ స్థానానికి 7, వార్డులకు 19, కోవెలకుంట్ల సర్పంచుకు 21, వార్డులకు 90, లింగాల సర్పంచ్‌కు 3, వార్డులకు 15 నామినేషన్లు దాఖలు అయినట్లు అధికారి తెలిపారు. పొట్టిపాడు సర్పంచ్‌కు 5, వార్డులకు 24, పెద్దకొప్పెర్ల సర్పంచ్‌కు 3, వార్డు స్థానాలకు 16, రేవనూరు సర్పంచ్‌కు 2, వార్డులకు 10, సౌదరదిన్నె సర్పంచ్‌కు 6, వార్డులకు 20, వల్లంపాడు సర్పంచ్‌కు 5, వార్డులకు 18, వెలగటూరు సర్పంచ్‌కు 6, వార్డులకు 20 నామినేషన్లు వచ్చినట్లు తెలిపారు. నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో ఎస్‌ఐ చంద్రశేఖర్‌రెడ్డి గట్టి పోలీసు బందోబస్తు నిర్వహించారు.


అవుకు: మండలంలో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది. మండంలో 21 పంచాయతీలు, 200 వార్డులు ఉన్నాయి. మూడు రోజుల పాటు సాగిన నామినేషన్ల ప్రక్రియలో సర్పంచ్‌ స్థానాలకు 100 మంది, వార్డు మెంబర్ల స్థానాలకు 322 మంది నామినేషన్లు వేశారు. చివరి రోజున సర్పంచ్‌ స్థానాలకు అన్నవరం- 1, చనుగొండ్ల- 3, కాశీపురం- 2, జూనుంతల- 1, కొండమనాయునిపల్లె- 1, మన్నేనాయక్‌తండా- 6, మెట్టుపల్లె- 7, అవుకు- 1, రామాపురం- 8, రామవరం- 1, సంగపట్నం- 3, శింగనపల్లె- 3, శివవరం- 1, సుంకేసుల- 7, ఉప్పలపాడు- 1, మంగంపేట- 3, వేములపాడు- 2 నామినేషన్లు వేశారు. అలాగే వార్డు మెంబర్ల స్థానాలకు 201 నామినేషన్లు దాఖలు చేశారు. 


సంజామల: రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గురువారంతో నామినేషన్ల దాఖలు ముగిసింది. చివరి రోజు అత్యధికంగా 40 మంది సర్పంచ్‌ స్థానాలకు, 182 మంది వార్డుమెంబర్‌ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. సర్పంచ్‌ స్థానాలకు అక్కంపల్లె 1, ఆకుమళ్ల 5, ఆల్వకొండ 2, గిద్దలూరు 1, కమలపురి 2, వసంతాపురం 3, నట్లకొత్తూరు 2, కానాల 2, ముదిగేడు 5, ఎగ్గోని 4, ముక్కమళ్ల 4, నొస్సం 1, పేరుసోముల 4, రామిరెడ్డిపల్లె 2, సంజామలలో రెండు నామినేషన్లు దాఖలు అయ్యాయి. 2వ తేదీన 9 మంది సర్పంచ్‌ స్థానాలకు నామినేషన్లు వేయగా, 32 మంది వార్డు స్థానాలకు, 3వ తేదీన 35 మంది సర్పంచు స్థానాలకు, 117 వార్డు స్థానాలకు నామినేషన్లు వచ్చినట్లు మండల ఎన్నికల అధికారి నాగకుమార్‌ తెలిపారు. 


గడివేముల: స్థానిక ఎన్నికల్లో మొదటి ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ గురువారం ముగిసింది. 5 నామినేషన్ల కేంద్రాల్లో గురువారం 45 సర్పంచ్‌ అభ్యర్థులు, 199 మంది వార్డు మెంబర్లు నామినేషన్లు వేశారని ఎంపీడీవో విజయసింహారెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 16 పంచాయతీలకు గాను 91 మంది, 164 వార్డులకు 402 మంది నామి నేషన్లు వేశారని ఎంపీడీవో తెలిపారు. 


పాణ్యం: మండలంలో రెండో విడత గ్రామ పంచాయతీ నామినేషన్‌లు గురువారం ముగిశాయి. మండలంలోని 19 గ్రామ పంచాయతీల సర్పంచ్‌ స్థానాలకు 112 నామినేషన్‌లు, 190 వార్డులకు 395 నామినేషన్‌లు దాఖలైనట్లు ఎన్నికల అఽధికారి దస్తగిరి తెలిపారు. కాగా 32 వార్డులు ఏకగ్రీవమైనట్లు తెలిపారు. గురువారం మూడో రోజు సర్పంచ్‌ స్థానాలకు 56, వార్డు మెంబర్‌ స్థానాలకు 199 మంది నామినేషన్‌ వేసినట్లు తెలిపారు.


కొలిమిగుండ్ల: మండలంలో సర్పంచ్‌కు, వార్డులకు నిర్వహించనున్న ఎన్నికలకు సంబంధించి నామినేషన్‌ దాఖలు చేశారు. మూడో రోజు గురువారం సర్పంచ్‌ స్థానాలకు 77 మంది, వార్డులకు 336 మంది నామి నేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారి, ఎంపీడీవో నాగరాజు తెలిపారు.


ఆత్మకూరు(వెలుగోడు): వెలుగోడు మండలంలో పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆరు గ్రామాల్లో మొత్తం 24 మంది బరిలో నిలిచినట్లు ఎంపీ డీవో అమానుల్లా గురువారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ వేల్పనూరులో 3, వెలుగోడులో 7, మోతుకూరులో 3, గుంతకందాలలో 4, బోయరేవులలో 3, అబ్దుల్లా పురంలో 4 చొప్పున అభ్యర్థులు సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2021-02-05T05:45:02+05:30 IST