పంటలను పరిశీలించిన శాస్త్రవేత్తలు
ABN , First Publish Date - 2021-10-22T04:29:50+05:30 IST
మండలంలోని ఎర్రగుంట్ల, బండిఆత్మకూరు గ్రామాల్లో శాస్త్రవేత్తలు వరి, పత్తి, జొనన పంటలను పరిశీలించారు.
బండి ఆత్మకూరు, అక్టోబర్ 21: మండలంలోని ఎర్రగుంట్ల, బండిఆత్మకూరు గ్రామాల్లో శాస్త్రవేత్తలు వరి, పత్తి, జొనన పంటలను పరిశీలించారు.మండల వ్యవసాయాధికారి నాగేశ్వరరెడ్డి నేతృత్వంలో డాక్టర్‌లు గాయత్రి, శివరామకృష్ణ, వెంకటరమణమ్మ పంటలు పరిశీలించారు. బండిఆత్మకూరులో వరిపంట కేడీలు అధికంగా వచ్చాయని, అధికారుల సూచన మేరకు వాటిని కోసినా పంట చేతికి రాకముదే మళ్ళీ వస్తున్నాయన్నారు. నంద్యాలలోని విత్తన దకాణదారులపై చర్యలు తీసుకోవాలని రైతులు వారికి ఫిర్యాదు చేశారు. పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు నివేదిస్తామని శాస్త్రవేత్తలు రైతులకు వివరించారు. పంటలకు సోకిన తెగుళ్ళకు వాడాల్సిన మందులను తెలియజేశారు.