నారసింహుడికి శరభవాహనసేవ
ABN , First Publish Date - 2021-03-24T06:13:15+05:30 IST
లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్స వాల ఆరో రోజు మంగళవారం జ్వాలా నరసింహ స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్ల ఉత్సవమూ ర్తులను పట్టువస్ర్తాలు, పూల మాలలతో ప్రత్యేకంగా అలంక రించారు.

దిగువన శేషవాహనంపై ప్రహ్లాదుడు
ఆళ్లగడ్డ,
మార్చి 23: లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్స వాల ఆరో రోజు మంగళవారం జ్వాలా
నరసింహ స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్ల ఉత్సవమూ ర్తులను
పట్టువస్ర్తాలు, పూల మాలలతో ప్రత్యేకంగా అలంక రించారు. అనంతరం స్వామికి
శరభవాహనసేవ నిర్వహిం చారు. దిగువ అహోబిలంలో ప్రహ్లాదవరదుడికి శేష వాహన సేవ
నిర్వహించారు. అనంతరం చంద్రప్రభ వాహనంపై అహోబిలేశుడు భక్తులకు
దర్శనమిచ్చాడు. కార్యక్రమాల్లో పీఠాధిపతి రంగనాథ యతీంద్ర మహాదేశికన్, ఈవో
నరసయ్య, ప్రధాన అర్చకుడు వేణుగోపాలన్, మఠం మేనేజర్ వైకుంఠ స్వామి
తదితరులు పాల్గొన్నారు. ఎగువ అహోబిలంలో బుధవారం లక్ష్మీనరసింహుడికి
పొన్నచెట్టు వాహన సేవ నిర్వహిస్తారు. దిగువ అహోబిలంలో మోహిని అలంకారం,
అభిషేకం, శరభవాహన సేవ జరుపుతారు.