ఇసుక ట్రాక్టరు పట్టివేత

ABN , First Publish Date - 2021-11-27T04:37:21+05:30 IST

కొలిమిగుండ్ల కస్తూర్బా పాఠశాల సమీపంలో ఎలాంటి ఆధార పత్రాలు లేకుండా వెళ్తున్న ఇసుక ట్రాక్టరును పట్టుకున్నట్లు ఎస్‌ఐ హరినాథ్‌రెడ్డి శుక్రవారం తెలిపారు.

ఇసుక ట్రాక్టరు పట్టివేత


కొలిమిగుండ్ల, నవంబరు 26: కొలిమిగుండ్ల కస్తూర్బా పాఠశాల సమీపంలో ఎలాంటి ఆధార పత్రాలు లేకుండా వెళ్తున్న ఇసుక ట్రాక్టరును పట్టుకున్నట్లు ఎస్‌ఐ హరినాథ్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వెంకటాంపల్లె గ్రామానికి డ్రైవర్‌ మంజుల రామ్మోహనను అరెస్టు చేసినట్టు తెలిపారు. పెన్నా నది నుంచి ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా దొంగచాటున ఇసుకను తీసుకొని కొలిమిగుండ్లకు వస్తుండగా తనిఖీల్లో భాగంగా కస్తూర్బా పాఠశాల వద్ద డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 


Updated Date - 2021-11-27T04:37:21+05:30 IST