నగరంలో నేటి నుంచి ఆంక్షలు

ABN , First Publish Date - 2021-05-02T05:30:00+05:30 IST

కొవిడ్‌ బారిన పడకుండా నగరంలో సోమవారం నుంచి ఆంక్షలు అమలు చేస్తున్నట్లు నగర పాలక సంస్థ కమిషనర్‌ డీకే బాలాజీ, మేయర్‌ బీవై రామయ్య తెలిపారు.

నగరంలో నేటి నుంచి ఆంక్షలు

 మధ్యాహ్నం 2 వరకే దుకాణాలు: కమిషనర్‌, మేయర్‌


కర్నూలు(అర్బన్‌), మే 2: కొవిడ్‌ బారిన పడకుండా నగరంలో సోమవారం నుంచి ఆంక్షలు అమలు చేస్తున్నట్లు నగర పాలక సంస్థ కమిషనర్‌ డీకే బాలాజీ, మేయర్‌ బీవై రామయ్య తెలిపారు.  కౌన్సిల్‌ హాలులో వ్యాపారులతో ఆదివారం సమావేశం వీరు నిర్వహించారు. ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, డీఎస్పీ మహేష్‌, అధికారులు పాల్గొన్నారు. నగరంలో సోమవారం నుంచి అన్ని రకాల దుకాణాలను మధ్యాహ్నం 2 గంటల దాకా  నిర్వహించుకోవాలని సూచించారు. ఆస్పత్రులు, మెడికల్‌ షాపులు, ఫుడ్‌ పార్సిల్‌ సర్వీస్‌ను మినహా యిస్తున్నామని తెలిపారు. వ్యాపారులు నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు కూడా అత్యవసరమైతే  తప్ప బయటకు రావద్దని, బయటకు వస్తే మాస్కులను ధరించాలని సూచించారు. పరిస్థితి అదుపులోకి వచ్చేవరకూ నిబంధనలు కొనసాగుతా యని తెలిపారు.

Updated Date - 2021-05-02T05:30:00+05:30 IST