సచివాలయ ఉద్యోగులకు రీ పోస్టింగ్‌

ABN , First Publish Date - 2021-01-13T05:39:32+05:30 IST

దేవనకొండ మండలం మాచాపురం, నెలబండ సచివాలయ ఉద్యోగులకు జడ్పీ సీఈఓ ఎం.వెంకటసుబ్బయ్య రీ పోస్టింగ్‌ ఆర్దరును మంగళవారం అందజేశారు.

సచివాలయ ఉద్యోగులకు రీ పోస్టింగ్‌

కర్నూలు(న్యూసిటీ), జనవరి 12: దేవనకొండ మండలం మాచాపురం, నెలబండ సచివాలయ ఉద్యోగులకు జడ్పీ సీఈఓ ఎం.వెంకటసుబ్బయ్య రీ పోస్టింగ్‌ ఆర్దరును మంగళవారం అందజేశారు. నెల క్రితం ఆ సచివాలయాలను కలెక్టర్‌ జీ.వీరపాండియన్‌ తనిఖీ చేశారు. ఆ సమయంలో రెండు సచివాలయాల్లో ఉద్యోగులు లేకపోవడంతో 16 మందిని సస్పెండ్‌ చేశారు. జడ్పీ సీఈఓ విచారణ జరిపిన అనంతరం సస్పెన్షన్‌ ఎత్తివేసి, రీ పోస్టింగ్‌ ఆర్డర్స్‌ అందజేశారు. డిప్యూటీ సీఈఓ టీవీ భాస్కర్‌నాయుడుకు ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. 


Updated Date - 2021-01-13T05:39:32+05:30 IST