రైల్వే స్టేషన్‌కు ఆర్టీసీ బస్సులు బంద్‌

ABN , First Publish Date - 2021-10-20T05:21:22+05:30 IST

మంత్రాలయం మండలంలోని తుంగభద్ర రైల్వే స్టేషన్‌లోకి రైల్వే అధికారులు ఆర్టీసీ బస్సులను అనుమతించని కారణంగా బుధవారం నుంచి బంద్‌ చేస్తున్నట్లు ఎమ్మిగనూరు డిపో మేనేజర్‌ సుబ్రమణేశ్వరరావు తెలిపారు.

రైల్వే స్టేషన్‌కు ఆర్టీసీ బస్సులు బంద్‌

మంత్రాలయం, అక్టోబరు 19: మంత్రాలయం మండలంలోని తుంగభద్ర రైల్వే స్టేషన్‌లోకి రైల్వే అధికారులు ఆర్టీసీ బస్సులను అనుమతించని కారణంగా బుధవారం నుంచి బంద్‌ చేస్తున్నట్లు ఎమ్మిగనూరు డిపో మేనేజర్‌ సుబ్రమణేశ్వరరావు తెలిపారు. రైల్వేస్టేషన్‌లోకి ఆటోలు, ట్యాక్స్‌లు, అనుమతి ఇచ్చి ఆర్టీసీ బస్సులను రాకుండా చేయడంపై మాధవరం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రైల్వే అధికారులు మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు.

Updated Date - 2021-10-20T05:21:22+05:30 IST