రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడి మృతి

ABN , First Publish Date - 2021-05-20T06:22:13+05:30 IST

మండల పరిధిలోని పగిడ్యాలకు చెందిన ఉపాధ్యాయుడు గిడ్డయ్య (49) బుధవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడి మృతి

పగిడ్యాల, మే 19: మండల పరిధిలోని పగిడ్యాలకు చెందిన ఉపాధ్యాయుడు గిడ్డయ్య (49) బుధవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.  తమ బంధువులు ఆసుపత్రిలో ఉండటంతో వారిని పరామర్శించేందుకు ఆయన మోటర్‌బైక్‌ పై కర్నూలుకు బయలుదేరారు. బ్రాహ్మణకొట్కూరు దాటిన తరువాత ట్రాక్టర్‌ ఢీకొట్టడంతో గిడ్డయ్య  తీవ్రంగా గాయపడ్డాడు. కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొం దుతూ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. గిడ్డయ్య ప్రాతకోట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఆయనకు భార్య రవణమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Updated Date - 2021-05-20T06:22:13+05:30 IST