రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-12-31T05:44:16+05:30 IST

బనగానపల్లె మండలంలోని దద్దనాల ప్రాజెక్టు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వర్రం మద్దిలేటిస్వామి కుమారుడు మహేంద్ర (32) మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

 బనగానపల్లె, డిసెంబరు 30: బనగానపల్లె మండలంలోని దద్దనాల ప్రాజెక్టు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వర్రం మద్దిలేటిస్వామి కుమారుడు మహేంద్ర (32) మృతి చెందాడు. ఈ ఘటన గురువారం జరి గింది. మహేంద్ర బనగానపల్లె నుంచి   స్వగ్రామం పెద్దరాజుపాలెంకు మోటారుసైకిల్‌పై వెళ్తుండగా  దద్దనాల ప్రాజెక్టు వద్ద ఎదురుగా వస్తున్న కారు ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. కర్నూలు ప్రభుత్వవైద్యశాలలో  వైద్యం పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. మృతుడికి భార్య నాగజ్యోతి, 3 సంవత్సరాల కుమారుడు జస్వంత్‌ ఉన్నారు.  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. Updated Date - 2021-12-31T05:44:16+05:30 IST