మోటారు సైకిళ్లు ఢీ

ABN , First Publish Date - 2021-02-01T06:20:38+05:30 IST

మండలంలోని రంగాపురం నుంచి మద్దిలేటిస్వామికి వెళ్లే రోడ్డులో ఆదివారం ఎదురెదురుగా వస్తున్న రెండు మోటారుసైకిళ్లు ఢీ కొనడంతో అంబాపురానికి చెందిన కంసలి మధుశేఖర్‌(35) మృతి చెందగా, అదే గ్రామానికి చెందిన దాసరి చిన్న మద్దయ్యకు తీవ్ర గాయాలయ్యాయి.

మోటారు సైకిళ్లు ఢీ

  1. ఒకరి మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు 


బేతంచెర్ల, జనవరి 31: మండలంలోని రంగాపురం నుంచి మద్దిలేటిస్వామికి వెళ్లే రోడ్డులో ఆదివారం ఎదురెదురుగా వస్తున్న రెండు మోటారుసైకిళ్లు ఢీ కొనడంతో అంబాపురానికి చెందిన కంసలి మధుశేఖర్‌(35) మృతి చెందగా, అదే గ్రామానికి చెందిన దాసరి చిన్న మద్దయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఎస్‌ఐ సురేష్‌ తెలిపిన వివరాలివి.. అంబాపురం గ్రామానికి చెందిన కంసలి పుల్లయ్య కుమారుడు మధుశేఖర్‌ గౌండా పని చేసుకుంటూ జీవించేవాడు. పని నిమిత్తం అంబాపురం నుంచి మోటారుసైకిల్‌పై రంగాపురానికి వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన చిన్న దాసరి మద్దయ్య మోటారుసైకిల్‌పై రంగాపురానికి వెళ్లి తన పని ముగించుకొని అంబాపురానికి వెళ్తుండగా రెండు మోటారుసైకిళ్లు ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని 108లో బేతంచెర్ల ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స చేసే లోపు మధుశేఖర్‌ మృతి చెం దాడు. చిన్నమద్దయ్యను మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. 

Updated Date - 2021-02-01T06:20:38+05:30 IST