కారు ఢీకొని వృద్ధుడి మృతి

ABN , First Publish Date - 2021-07-08T05:35:31+05:30 IST

మండలంలోని జిల్లెల్ల గ్రామం వద్ద కారు ఢీకొని వృద్ధుడు మృతి చెందాడు.

కారు ఢీకొని వృద్ధుడి మృతి

గోస్పాడు, జూలై 7: మండలంలోని జిల్లెల్ల గ్రామం వద్ద కారు ఢీకొని వృద్ధుడు మృతి చెందాడు. ఎస్‌ఐ దానమ్మ తెలిపిన వివరాల మేరకు.. గోస్పాడు నుంచి గోవిందపల్లెకు వెళ్తున్న టీఎస్‌ 13 ఈడీ 8926 అనే నంబరు గల కారు జిల్లెల్ల ఊరి బయట పశువులను కాస్తున్న చిన్న సుబ్బారెడ్డిని(70) వేగంగా ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వానికి తరలించారు. మృతుడి కొడుకు చంద్రశేఖర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ దానమ్మ తెలిపారు.Updated Date - 2021-07-08T05:35:31+05:30 IST