ఘనంగా గంధోత్సవం

ABN , First Publish Date - 2021-11-03T05:25:39+05:30 IST

జిల్లాలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన షేక్షావలీ, షాషావలీ సాహె బ్‌ల ఉరుసు సందర్భంగా గంధోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగినట్లు దర్గా నిర్వాహకులు మంగళవారం తెలిపారు.

ఘనంగా గంధోత్సవం

హొళగుంద, నవంబరు 2: జిల్లాలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన షేక్షావలీ, షాషావలీ సాహె బ్‌ల ఉరుసు సందర్భంగా గంధోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగినట్లు దర్గా నిర్వాహకులు మంగళవారం తెలిపారు. మాజీ దర్గా నిర్వాహకుడు అబ్దుల్‌రావుఫ్‌ ఇంటి నుంచి రాయచూరుకు చెందిన దర్గా పీఠాధిపతి సయ్యద్‌ ఖాజీ మోయినుద్దీన్‌ అహ్మద్‌ ఖాద్రీ గంధాన్ని తలపై పెట్టుకొని, డప్పులు, వాయిద్యాల మధ్య గ్రామంలో ఊరేగించారు. ఆలూరు సీఐ ఈశ్వరయ్య ఆధ్వర్యంలో హొళగుంద, ఆలూరు, హాలహర్వి ఎస్‌ఐలు విజయ్‌కుమార్‌, రామా నుజులు, వెంకటట్‌సురేశ్‌ బందోస్తు ఏర్పాటు చేశారు

Updated Date - 2021-11-03T05:25:39+05:30 IST