ఘనంగా స్వాతి వేడుకలు

ABN , First Publish Date - 2021-12-30T05:48:39+05:30 IST

అహోబిలం లక్ష్మీనరసింహస్వామి జన్మనక్షత్రమైన స్వాతి వేడుకలు బుధవారం వేదపండితులు ఘనంగా నిర్వహించారు.

ఘనంగా స్వాతి వేడుకలు

ఆళ్లగడ్డ, డిసెంబరు 29: అహోబిలం లక్ష్మీనరసింహస్వామి జన్మనక్షత్రమైన స్వాతి వేడుకలు బుధవారం వేదపండితులు ఘనంగా నిర్వహించారు. వేకువజామున్నే నవనారసింహులను వేదపండితులు పూలమాలలతో అలంకరించి అభిషేకాలు, విశేషపూజలు చేపట్టారు. ఎగువ అహోబిలంలోని జ్వాలా నరసింహస్వామి సన్నిధిలో సుదర్శన హోమాన్ని వేదపండితులు నిర్వహించారు. ఈ వేడుకల్లో జడ్పీ మాజీ చైర్మన్‌ లబ్బి వెంకటస్వామి, ఆళ్లగడ్డ మాజీ డీఎస్పీ బీఆర్‌ శ్రీనివాసులు, ఎమ్మెల్యే బిజేంద్రారెడ్డి, భక్తులు పాల్గొన్నారు.Updated Date - 2021-12-30T05:48:39+05:30 IST