ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి

ABN , First Publish Date - 2021-02-01T06:16:01+05:30 IST

గ్రామ పంచాయతీ ఎన్నికలకు జడ్పీలోని మినీ సమావేశ భవనంలో ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ రూంకు వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని జడ్పీ సీఈఓ ఎం.వెంకటసుబ్బయ్య ఆదివారం తెలిపారు.

ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి

  1. జడ్పీ సీఈవో ఎం.వెంకటసుబ్బయ్య


కర్నూలు(న్యూసిటీ), జనవరి 31: గ్రామ పంచాయతీ ఎన్నికలకు జడ్పీలోని మినీ సమావేశ భవనంలో ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ రూంకు వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని జడ్పీ సీఈఓ ఎం.వెంకటసుబ్బయ్య ఆదివారం తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలకు సంబంధించిన ఫిర్యాదులను టోల్‌ ఫ్రీ నెంబరు 18004255180, ఈ మెయిల్‌ జఞ్ఛజ్ఛూఛ్టిజీౌుఽటజుుఽజూఃజఝ్చజీజూ.ఛిౌఝ వాట్సాప్‌ నెంబరు 8897870074తో పాటు లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు చేయవచ్చన్నారు. వీటితో పాటు కంట్రోల్‌ రూంలో రెండు టీవీలు ఏర్పాటు చేశామని, వాటిల్లో వచ్చే వివరాలను కూడా నమోదు చేసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను సంబంధిత మండలాల ఎంపీడీవోలకు పంపుతామన్నారు. అందులో ఫిర్యాదు తీవ్రతను బట్టి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకునేవిధంగా ఎన్నికల సంఘానికి పంపిస్తామన్నారు. 24 గంటలు పని చేసే కంట్రోల్‌ రూంను స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ మోహన్‌దా్‌స, డీఎస్పీ రాజీవ్‌కుమార్‌, వాణిజ్యపన్నుల శాఖ ఉపకమిషనర్‌ ఎం.సత్యప్రకాష్‌, ఎక్సైజ్‌ సీఐ వెంకటేశ్వర్లు పర్యవేక్షిస్తారన్నారు. వీరితోపాటు మూడు షిప్టులలో ఉద్యోగులు పనిచేస్తున్నారన్నారు. 

Updated Date - 2021-02-01T06:16:01+05:30 IST