‘ఆసుపత్రుల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలి’
ABN , First Publish Date - 2021-05-09T05:01:27+05:30 IST
ప్రైవేటు ఆసుపత్రుల్లో ఫీజుల దోపిడీని అరికట్లాని డీవైఎఫ్‌ఐ పట్టణ అధ్యక్ష, కార్యయదర్శులు నాగరాజు, వీరేష్ డిమాండ్ చేశారు.

ఆదోని(అగ్రికల్చర్), మే 8: ప్రైవేటు ఆసుపత్రుల్లో ఫీజుల దోపిడీని అరికట్లాని డీవైఎఫ్‌ఐ పట్టణ అధ్యక్ష, కార్యయదర్శులు నాగరాజు, వీరేష్ డిమాండ్ చేశారు. శనివారం యూటీఎఫ్ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహిం చారు. వారు మాట్లాడుతూ పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రులకు అనారోగ్యాలతో ప్రజలు వెళితే కరోనా టెస్టు చేయించుకొని రావాలని ప్రైవేటు ల్యాబ్‌కు రెఫర్ చేస్తున్నారని అన్నారు. ర్యాపిడ్ టెస్టుకు రూ.2 వేలు నుంచి మూడు వేల వరకు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఇష్టానుసారంగా ఆసుపత్రుల్లో డబ్బులు ఫీజుల రూపంలో దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా జిల్లా వైద్యాధికా రులు దృష్టి సారించి ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని కోరారు. నాయకులు సతీష్‌కుమార్, మోహన్, నవీన్, గణేష్, అనిల్ పాల్గొన్నారు.