ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లను విడుదల చేయాలి
ABN , First Publish Date - 2021-01-21T04:39:55+05:30 IST
ఏపీపీఎస్సీ గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 నోటిఫికేషన్లను విడుదల చేసి పోస్టులను భర్తీ చేయాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణ్‌రావు డిమాండ్ చేశారు.

- ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి
- ఎమ్మెల్సీ లక్ష్మణ్‌రావు
ఎమ్మిగనూరు, జనవరి 20: ఏపీపీఎస్సీ గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 నోటిఫికేషన్లను విడుదల చేసి పోస్టులను భర్తీ చేయాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణ్‌రావు డిమాండ్ చేశారు. బుదవారం ఆర్‌ఆండ్‌బీ గెస్ట్ హౌస్‌లో యూటీఎఫ్ నాయకులతో సమావేశమయ్యారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ఐదేళ్లుగా నోటిఫికేషన్లు ఇవ్వకపోవటంతో వయోపరిమితి దాటి పోతోందని, గరిష్ఠ వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచాలని కోరారు. రాష్ట్రవ్యా ప్తంగా ఖాళీగా ఉన్న 15వేల ఉపాధ్యాయ పోస్టులను ఏప్రిల్ డీఎస్సీలో భర్తీ చేయాలన్నారు. డీఎస్పీ 2003ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేసే ఫై లు న్యాయశాఖ దగ్గర ఉందని, పరిష్కారం అయిన వెంటనే అమలు చేయా లన్నారు. పీఆర్సీ నివేదిక సమర్పించినందువల్ల వెంటనే అమలు చేయాల న్నారు. ఎకనామిక్ వీకర్ సెక్షన్ (ఈడబ్యూఎస్) వారికి 10శాతం రిజర్వేష న్లను కేంద్రం అమలు చేస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేయా లని కోరారు. అనంతరం యూటీఎఫ్ కౌన్సిల్ సమావేశాల ఆహ్వానపత్రికలను విడుదల చేశారు. నాగమణి, యల్లప్ప, శాంతిరాజు, హనుమంతు, రామాంజి, దేవపాల్, రాఘవేంద్ర, నరసింహులు, చిన్నఎల్లప్ప, రంగన్న, లవ, రాజు, కేనాగరాజులు పాల్గొన్నారు.