జడ్పీటీసీలకు గౌరవ వేతనం విడుదల
ABN , First Publish Date - 2021-11-06T05:24:20+05:30 IST
జిల్లాలోని జడ్పీటీసీలకు 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గౌరవవేతనాలను ప్రభుత్వం 2,3,క్వార్టర్స్‌కు రూ.11.40 లక్షలను విడుదల చేసినట్లు జిల్లా పరిషత్ సీఈవో ఎం.వెంకటసుబ్బయ్య శుక్రవారం తెలిపారు.

కర్నూలు (న్యూసిటీ), నవంబరు 5: జిల్లాలోని జడ్పీటీసీలకు 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గౌరవవేతనాలను ప్రభుత్వం 2,3,క్వార్టర్స్‌కు రూ.11.40 లక్షలను విడుదల చేసినట్లు జిల్లా పరిషత్ సీఈవో ఎం.వెంకటసుబ్బయ్య శుక్రవారం తెలిపారు. మొదటి క్వార్టర్‌లో రూ.5,48,375, రెండో క్వార్టర్‌లో రూ.5,92,200 విడులైనట్లు తెలిపారు. జడ్పీ చైర్మన్‌కు నెలకు రూ.40 వేలు, ప్రతి జడ్పీటీసీకి, కో ఆప్షన్ సభ్యులకు నెలకు రూ.6వేలు గౌరవ వేతనం లభిస్తుందని తెలిపారు. ప్రభుత్వం విడుదల చేసిన గౌరవ వేతనాలను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు సభ్యుల ఖాతానెంబర్లను సేకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎంపీపీలకు నెలకు రూ.6వేలు, ఎంపీటీసీలకు నెలకు రూ.3 వేలు చొప్పున గౌరవ వేతనంగా ప్రభుత్వం అందిస్తున్నట్లు తెలిపారు. ఒక నెలకు జిల్లాలోని 53 మంది ఎంపీపీలు, కో ఆప్షన్ సభ్యులతో కలిపి 804 మంది ఎంపీటీసీలకు రూ.27.30లక్షలు విడుదల కావాల్సి ఉందని తెలిపారు. మిగతా వారికి త్వరలో విడుదలయ్యే అవకాశం ఉందని జడ్పీ సీఈవో తెలిపారు.