నామినేషన్ల తిరస్కరణ

ABN , First Publish Date - 2021-02-06T05:17:13+05:30 IST

మండలంలోని 19 గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు, వార్డుల నామినేషన్‌ను శుక్రవారం పరిశీలించారు.

నామినేషన్ల తిరస్కరణ

పాణ్యం, ఫిబ్రవరి 5: మండలంలోని 19 గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు, వార్డుల నామినేషన్‌ను శుక్రవారం పరిశీలించారు. మొత్తం సర్పంచ్‌ల నామినేషన్‌లు 112, వార్డుల నామినేషన్‌లు 395 దాఖలు చేశా రు. పిన్నాపురం సర్పంచ్‌ అభ్యర్థి ఓర్వకంటి చంద్రకాంత్‌ కు వయసు లేక పోవడంతో తిరస్కరించినట్లు ఎన్నికల అఽధికారి దస్తగిరి తెలిపారు. పి న్నాపురం, గగ్గగటూరు, గోనవరం 4, గోరుకల్లు, కొండజూటూరు, పాణ్యం, సుగాలిమెట్ట లోని 2వార్డు నామినేషన్లు తిరస్కరణకు గురైనట్లు తెలిపారు.

 

గడివేముల: సర్పంచ్‌, వార్డు మెంబర్ల అభ్యర్థుల నామినేషన్లను శుక్రవారం ఆర్‌వోలు పరిశీలించారు. వార్డు మెంబర్ల పోటీకి వచ్చిన 402 నామినేషన్లను, సర్పంచ్‌ పోటీకి అభ్యర్థులు వేసిన 91 నామిషన్లను పరిశీలించారు. మండలంలో వార్డు మెంబర్లకు సంబంధించిన నాలుగు నామినేషన్లను తిరస్కరించినట్లు ఎంపీడీవో విజయసింహారెడ్డి తెలిపారు. బిలకలగూడురు గ్రామంలో కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకపోవడంతో 2, కొరటమద్ది గ్రామంలో వార్డు మెంబరుకు ప్రతిపాదకుడు మరో వార్డులో ఉండటంతో, కె.బొల్లవరం గ్రామంలో రిజర్వేషన్‌కు సంబం ధించిన అభ్యర్థి కాకుండా ఇతరులు నామినేషన్‌ వేయడంతో తిరష్కరిం చినట్లు తెలిపారు.


అవుకు: మండలంలో నామినేషన్లు పరిశీలనలో సర్పంచ్‌ స్థానాలకు 17 మంది, వార్డు సభ్యులు 21 మంది నామినేషన్‌లు తిరస్కరణకు గురైనట్లు మండల రిటర్నింగ్‌ అధికారి ఆజాంఖాన్‌ శుక్రవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ మండలంలో 21 పంచాయతీలు, 200 వార్డులు ఉన్నాయి. సర్పంచ్‌ స్థానాలకు 100 మంది, వార్డు సభ్యుల స్థానాలకు 322 మంది నామినేషన్లు దాఖలు చేశారన్నారు. అయితే 17 మంది సర్పంచ్‌ అభ్యర్థుల నామినేషన్లు పరిశీలనలో నామినేషన్‌ పత్రాలు సరిగా లేక పోవటంతో కాశీపురం- 1, చెర్లోపల్లె- 2, మెట్టుపల్లె- 4, అవుకు- 1, రామాపురు- 9 తిరస్కరణకు గురయ్యాయన్నారు. అలాగే వార్డు సభ్యుల స్థానాలకు వేసిన 21 మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయని తెలిపారు. 


బనగానపల్లె: మండలంలో మొత్తం 24 గ్రామ పంచాయతీలు, 262 వార్డు సభ్యులకు గాను నామినేషన్ల పరిశీలన కార్యక్రమం రిటర్నింగ్‌ అధికారుల పర్యవేక్షణలో శుక్రవారం ఆయా గ్రామ పంచాయతీ నామినేషన్‌ కేంద్రాల్లో పరిశీలించారు. ఐదుగురు సర్పంచ్‌ అభ్యర్థులు, 19మంది వార్డు సభ్యుల నామినేషన్ల తిరస్కరణకు గురైనట్లు మండల రిటర్నింగ్‌ అఽధికారి నాగప్రసాద్‌ తెలిపారు. మొత్తం 157 మంది సర్పంచ్‌లకు నామినేషన్లు దాఖలు చేయగా ఐదుగురు సర్పంచ్‌ అభ్య ర్థుల నామినేషన్లు పరిశీలనలో నామినేషన్‌ పత్రాలు సరిగా లేకపో వడంతో తిరస్కరించినట్లు మండల ఎన్నికల అధికారి తెలిపారు. బనగాన పల్లె 1, ఇల్లూరుకొత్తపేట 2, తమ్మడపల్లె 1, యాగంటిపల్లె 1 సర్పంచ్‌ స్థానం తిరస్కరణకు గురైనట్లు ఆయన తెలిపారు. దీంతో సర్పంచ్‌ స్థానాలకు 704 మంది ఉన్నట్లు తెలిపారు. అలాగే వార్డు సభ్యులకు సంబంధించి మొత్త 723 నామినేషన్లు దాఖలు చేయగా వార్డు సభ్యులను 19 వార్డు నామినేషన్లు తిరస్కరణకు గురైనట్లు ఆయన తెలిపారు. వార్డు సభ్యులకు సబంధించి అభ్యంతరాల పరిశీలన అలాగే వార్డు సభ్యులకు సంబంధించి బనగానపల్లె 6, గులాం అలియాబాద్‌ తాండా 1, పలుకూరు 2, పసుపల 6, పాతపాడు 4 వార్డు సభ్యులకు సంబంధించి నామినేషన్‌లు సరిగా లేకపోవడంతో తిరస్కరించినట్లు తెలిపారు. 


సంజామల: పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్లు వేసిన అభ్యర్థుల నామినేషన్లను స్ర్కూటినీలో భాగంగా శుక్రవారం అధికారులు పరిశీలించారు. అక్కంపల్లె సర్పంచ్‌ స్థానానికి ఇరువురు నామినేషన్లు వేశారు. వీరి నామినేషన్లు తిరస్కరించారు. నట్లకొత్తూరు వార్డుమెంబర్‌ స్థానం, కానాల ఒక వార్డుమెంబర్‌ స్థానం, ఎగ్గోనిలో మరో వార్డుమెంబర్‌ స్థానానికి నామినేషన్‌ తిరస్కరించినట్లు ఈవోపీఆర్డీ రాధికారెడ్డి తెలిపారు. మొత్తం సర్పంచ్‌లకు రెండు నామినేషన్లు, వార్డుమెంబర్‌ స్థానాలకు సంబంధించి మూడు నామినేషన్లు తిరస్కరించినట్లు తెలిపారు. వీరు నంద్యాల సబ్‌ కలెక్టర్‌ వద్ద అప్పీల్‌ చేసుకొనేందుకు అవకాశం ఉందని తెలిపారు.


కోవెలకుంట్ల: మండలంలో రెండో విడత జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పరిశీలన రోజు శుక్రవారం 10 మంది సర్పంచ్‌ అభ్యర్థుల నామినేషన్లు, 3 వార్డు స్థానాల నామినేషన్లను తిరస్క రించినట్లు ఎంపీడీవో మహబూబ్‌దౌలా, ఈవోపీఆర్డీ ప్రకాష్‌నా యుడులు తెలిపారు. మొత్తం 17 గ్రామ పంచాయతీలకు గానూ 110 మంది సర్పంచ్‌లకు అభ్యర్థులు నామినేషన్లు వేయగా, 404 మంది వార్డు స్థానాలకు నామినేషన్లు వచ్చాయి. వీటిలో 10 సర్పంచ్‌ అభ్యర్థులవి, మూడు వార్డు స్థానాల నామినేషన్లు వివిధ కారణాల తిరస్కరణకు గురైనట్లు వారు తెలిపారు. 

Updated Date - 2021-02-06T05:17:13+05:30 IST