‘అధికారం చేపడితే ఉచితంగా రిజిస్ట్రేషన్‌’

ABN , First Publish Date - 2021-12-08T05:30:00+05:30 IST

తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన తక్షణమే గృహ లబ్ధిదారులకు ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేయిస్తామని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు తెలిపారు.

‘అధికారం చేపడితే ఉచితంగా రిజిస్ట్రేషన్‌’
జాలిమంచిలో పర్యటిస్తున్న మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు

ఆదోని రూరల్‌, డిసెంబరు 8: తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన తక్షణమే గృహ లబ్ధిదారులకు ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేయిస్తామని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు తెలిపారు. గౌరవ సభ కార్యక్రమంలో భాగంగా ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి జాలిమంచి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్య కర్తలు పెద్దఎత్తున మేళతాళాలతో, పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. గృహ లబ్ధిదారులు, ప్రజలనుద్దేశించి మీనాక్షినాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దివాళా తీసిందని అన్నారు. ఓటీఎస్‌ కింద రూ.10 వేలు చెల్లించవద్దని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ తిమ్మప్ప, బంగారయ్య, గోవిందు, శరనప్ప, హుసేని, రామాంజి, రంగన్న, బాషా, లక్ష్మన్న, రామకృష్ణ, రంగస్వామి నాయుడు, బీటీ శీన, లింగన్నగౌడ్‌, విశ్వనాథ్‌గౌడ్‌, ఇస్వీ మల్లికార్జున, హుసేని పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-08T05:30:00+05:30 IST