జలమండలి ఎస్‌ఈగా రెడ్డిశేఖర్ బాధ్యతల స్వీకరణ
ABN , First Publish Date - 2021-12-09T05:41:58+05:30 IST
కర్నూలు జిల్లా మైనర్ ఇరిగేషన ఎస్‌ఈగా హంద్రీ నీవా ప్రాజెక్టు సర్కిల్-1 ఎస్‌ఈగా పని చేస్తున్న రెడ్డి శేఖర్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కర్నూలు(అగ్రికల్చర్), డిసెంబరు 8: కర్నూలు జిల్లా మైనర్ ఇరిగేషన ఎస్‌ఈగా హంద్రీ నీవా ప్రాజెక్టు సర్కిల్-1 ఎస్‌ఈగా పని చేస్తున్న రెడ్డి శేఖర్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన బుధవారం జలమండలి కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. నీటిపారుదల వనరు లను అభివృద్ధి చేసి రైతులకు ప్రయోజనం కల్పిస్తామని, తాగునీటి అవసరాలు తీర్చేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్‌ఈ రెడ్డి శేఖర్ తెలిపారు.