‘రికార్డులు సక్రమంగా నిర్వహించాలి’

ABN , First Publish Date - 2021-12-25T06:12:27+05:30 IST

సచివాలయాలలో రికార్డులు సక్రమంగా నిర్వహించాలని నంద్యాల సబ్‌ కలెక్టర్‌ చాహత్‌బాజ్‌పాయ్‌ అన్నారు.

‘రికార్డులు సక్రమంగా నిర్వహించాలి’

పాణ్యం, డిసెంబరు 24: సచివాలయాలలో రికార్డులు సక్రమంగా నిర్వహించాలని నంద్యాల సబ్‌ కలెక్టర్‌ చాహత్‌బాజ్‌పాయ్‌ అన్నారు. శుక్రవారం ఆమె మండలంలోని కౌలూరు, పాణ్యం సచివాలయాలను పరిశీలించారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటీఎస్‌లను సత్వరంగా పూర్తి చేయాలన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలన్నారు. కౌలూరు, పాణ్యం గ్రామాలలో ల్యాండ్‌ కన్వర్షన్‌ పరిశీలించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దారు మల్లికార్జునరెడ్డి, ఆ్‌ఐ శేషాద్రి, వీఆర్‌ఓలు మహేష్‌బాబు, రమణ, జయరాముడు, వెంకటకృష్ణ పాల్గొన్నారు.  

Updated Date - 2021-12-25T06:12:27+05:30 IST