‘ఆ సమయంలో బయటకు వస్తే కేసులు’

ABN , First Publish Date - 2021-05-21T04:51:52+05:30 IST

కర్ఫ్యూ సమయంలో ఎవరైనా బయటకు వస్తే కేసులు నమోదు చేయాలని ఆదోని ఆర్డీవో రామకృష్ణారెడ్డి ఆదేశించారు.

‘ఆ సమయంలో బయటకు వస్తే కేసులు’
కర్ఫ్యూను పరిశీలిస్తున్న ఆర్డీవో రామకృష్ణారెడ్డి

మద్దికెర, మే 20: కర్ఫ్యూ సమయంలో ఎవరైనా బయటకు వస్తే కేసులు నమోదు చేయాలని ఆదోని ఆర్డీవో రామకృష్ణారెడ్డి ఆదేశించారు. గురువారం మద్దికెర గ్రామంలో మధ్యాహ్నం కర్ఫ్యూ, 104 సెక్షన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ మధ్యాహ్నం 12గంటల నుంచి ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూ సమయంలో బయటకు వస్తే జరిమానా, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.  కర్ఫ్యూ ముగిసేంత వరకు ఎటువంటి పరిస్థితులలో దేవర్లు, సంతలు జరపకూడదన్నారు. వివాహాలు కేవలం 20మందికే అనుమతి ఇవ్వాలని ఆదేశించారు. గుంపులుగుంపులుగా వివాహాలు జరిపిస్తే కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ నాగభూషణం, ఎంపీడీవో నరసింహమూర్తి, వీఆర్వో రంగస్వామి, పంచాయతీరాజ్‌ ఏఈ చౌడేశ్వరరావు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-21T04:51:52+05:30 IST