రేషన్‌ బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2021-12-30T05:56:12+05:30 IST

వెలుగోడు పట్టణంలోని లక్ష్మీనగర్‌లో బుధవారం తెల్లవారుజామున 56 బస్తాల రేషన్‌ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

రేషన్‌ బియ్యం పట్టివేత

ఆత్మకూరు(వెలుగోడు), డిసెంబరు 29: వెలుగోడు పట్టణంలోని లక్ష్మీనగర్‌లో బుధవారం తెల్లవారుజామున 56 బస్తాల రేషన్‌ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వెలుగోడు ఎస్సై జగన్‌మోహన్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వెలుగోడుకు చెందిన రఫీ రేషన్‌ బియ్యాన్ని తరలిస్తున్నట్లు తమకు సమాచారం రావడంతో  దాడులు నిర్వహించి 56 బస్తాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి రఫీని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. తిమ్మనపల్లె గ్రామానికి చెందిన రాజులయ్య అనే వ్యక్తి నాటుసారా విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో దాడులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. అతని వద్ద నుంచి 5లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపించినట్లు వివరించారు. 
Updated Date - 2021-12-30T05:56:12+05:30 IST