అత్యాచారయత్నం

ABN , First Publish Date - 2021-01-28T05:33:31+05:30 IST

కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఔట్‌ సోర్సింగ్‌ కింద పని చేస్తున్న ఓ ఉద్యోగినికి మద్యం తాపించి.. అత్యాచార యత్నం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అత్యాచారయత్నం

కర్నూలు(హాస్పిటల్‌), జనవరి 27: కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఔట్‌ సోర్సింగ్‌ కింద పని చేస్తున్న ఓ ఉద్యోగినికి మద్యం తాపించి.. అత్యాచార యత్నం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం మధ్యాహ్నం నలుగురు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ఫుల్‌గా మద్యం సేవించారు. మరో మహిళా ఉద్యోగికి మద్యం తాపించి అత్యాచార యత్నం చేశారు. మద్యం మత్తు నుంచి తేరుకున్న ఆ మహిళా ఉద్యోగి ప్రతిఘటించింది. తన దగ్గర ఉన్న రూ.15 వేలు చోరీకి గురవుతున్నట్లు బాధితురాలు గుర్తించింది. ఘటనపై బాధితురాలు ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు, అవుట్‌ పోలీస్‌స్టేషన్‌, సంబంధిత ఏజెన్సీకి ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ విచారణకు ఆదేశించారు. 


Updated Date - 2021-01-28T05:33:31+05:30 IST