రాజీవ్‌ గాంధీ వర్ధంతి

ABN , First Publish Date - 2021-05-21T05:30:00+05:30 IST

నగరంలోని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో రాజీవ్‌ గాంధీ వర్ధంతిని శుక్రవారం నిర్వహించారు.

రాజీవ్‌ గాంధీ వర్ధంతి
కర్నూలులోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో రాజీవ్‌ గాంధీకి నివాళి

కర్నూలు(అర్బన్‌), మే 21: నగరంలోని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో రాజీవ్‌ గాంధీ వర్ధంతిని శుక్రవారం నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో రాజీవ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం సి.క్యాంప్‌ సెంటర్‌లోని రాజీవ్‌ గాంధీ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ప్రజలకు కరోనా నివారణపై అవగాహన కల్పిస్తూ మాస్కులను పంపిణీ చేశారు. పార్టీ నగర అధ్యక్షుడు జాన్‌ విల్సన్‌, మంత్రాలయం నియోజకవర్గ ఇనాచార్జి బాబు రావు, డాక్టర్స్‌ సెల్‌ అధ్యక్షుడు అమరేందర్‌ రె డ్డి, కాంగ్రెస్‌ నాయకులు బీవీ, సుబ్రహ్మణ్యం, పీరా, రియాజ్‌, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-05-21T05:30:00+05:30 IST