‘చట్టాలపై అవగాహన పెంచుకోవాలి’

ABN , First Publish Date - 2021-11-09T05:31:11+05:30 IST

ప్రజలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని ఆళ్లగడ్డ సీనియర్‌ సివిల్‌ జడ్జి శివశంకర్‌ సూచించారు.

‘చట్టాలపై అవగాహన పెంచుకోవాలి’

చాగలమర్రి, నవంబరు 8: ప్రజలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని ఆళ్లగడ్డ సీనియర్‌ సివిల్‌ జడ్జి శివశంకర్‌ సూచించారు. సోమవారం సాయంత్రం మండలంలోని ముత్యాలపాడు గ్రామంలో న్యాయసేవ సంఘం ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలన్నారు. బార్‌ అసోషియేషన్‌ ఉపాధ్యక్షుడు మురళీధర్‌, ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి, సర్పంచ్‌ శంకరమ్మ, ఏపీపీలు సోమశేఖర్‌రెడ్డి, శివరామిరెడ్డి, షడ్రక్‌, ప్రభాకర్‌రెడ్డి, ఎస్‌ఐ మారుతీ, సాగునీటి సంఘ అధ్యక్షుడు శేషురమేష్‌ పాల్గొన్నారు.Updated Date - 2021-11-09T05:31:11+05:30 IST