పొలంలో కొండచిలువ
ABN , First Publish Date - 2021-05-21T05:35:45+05:30 IST
మండలంలోని ఆర్.నాగులవరం గ్రామ సమీపంలో గురువారం ఉపాధి హామీ పనులు కూలీ లు చేపడుతుండగా కొండ చిలువ కనిపించింది.

రుద్రవరం, మే 20: మండలంలోని ఆర్.నాగులవరం గ్రామ సమీపంలో గురువారం ఉపాధి హామీ పనులు కూలీ లు చేపడుతుండగా కొండ చిలువ కనిపించింది. కాలువలో పని చేస్తుండగా 12 అడుగుల పొడవున ఉన్న కొండ చిలువ కనిపించింది. ఉపాధిహామీ కూలీలు భయబ్రాంతులకు గురయ్యారు. కొండచిలువను చంపిన అనంతరం ఉపాధిహామీ పనులను కొనసాగించారు.