అత్యాచార నిందితులను శిక్షించాలి

ABN , First Publish Date - 2021-01-12T05:46:04+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అత్యాచార ఘటనల్లో నిందితులను కఠినంగా శిక్షించాలని ఏపీ మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి రాష్ట్ర అద్యక్షుడు దండు వీరయ్య మాదిగ డిమాండ్‌ చేశారు.

అత్యాచార నిందితులను శిక్షించాలి

 ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ


కర్నూలు(న్యూసిటీ), జనవరి 11: రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అత్యాచార ఘటనల్లో  నిందితులను కఠినంగా శిక్షించాలని ఏపీ మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి రాష్ట్ర అద్యక్షుడు దండు వీరయ్య మాదిగ డిమాండ్‌ చేశారు. అత్యాచారాలను నివారించాలని కోరుతూ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమంలో భాగంగా  సోమవారం పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా  వీర య్య మాదిగ మాట్లాడుతూ రాయలసీమ జిల్లాలో ఇటీవల వరుసగా జరిగిన హత్యలు, అత్యాచారాలపై  ప్రభుత్వం విచారణ జరపాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ధరూర్‌ మాదిగ,   ఆశీర్వాదం, రాజయ్య, కోటేశ్వర్‌  పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-12T05:46:04+05:30 IST