ఇంటికెళ్లి..

ABN , First Publish Date - 2021-02-02T04:51:07+05:30 IST

ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు వేశారు.

ఇంటికెళ్లి..
రుద్రవరం: చెంచుగూడెంలో పోలియో నివారణపై అవగాహన

  1.  చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన వైద్య సిబ్బంది


మహానంది, ఫిబ్రవరి 1: ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు వేశారు. సోమవారం మహానంది మండలం నల్లమల లోని కరుణానిధి చెంచుగూడెంలోని చిన్నారులకు ఎం. తిమ్మాపురం ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఎంపీహెచ్‌ఈవో ఉసేన్‌రెడ్డి సిబ్బందితో ప్రత్యేక వాహనం ద్వారా అక్కడికి చేరుకొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు పాల్గొన్నారు. మండలంలో రెండో రోజు వైద్య సిబ్బంది ఇంటింటా తిరిగి పోలియో చుక్కలు వేసినట్లు వైద్యాఽధికారి చంద్రశేఖర్‌ తెలిపారు.


చాగలమర్రి: మండలంలోని 17 సచివాలయాల పరిధిలోని 41 పోలింగ్‌ కేంద్రాల్లో 7,386 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు వైద్యుడు గంగాధర్‌ తెలిపారు. సోమవారం చాగలమ్మ చెంచు కాలనీలో ఇంటింటికి వెళ్లి చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు తెలిపారు. మొదటి రోజు 96 శాతం, రెండో రోజు 3 శాతం పోలియో చుక్కలు వేశామని తెలిపారు. మిగిలిపోయిన చిన్నారులకు మంగళవారం ఇంటింటికి వెళ్లి వైద్య సిబ్బంది పోలియో చుక్కలు వేస్తారన్నారు. హెల్త్‌ ఎడ్యుకేటర్‌ వెంకటమ్మ, సూపర్‌వైజర్‌ రామలింగారెడ్డి, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. 


రుద్రవరం: మండలంలోని చిన్నయ్యస్వామి చెంచుగూడెంలో సోమవారం వైద్యురాలు గాయత్రి, సిబ్బంది ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు చిన్నారులకు వేశారు. అనంతరం వైద్యురాలు మాట్లాడుతూ పల్స్‌ పోలియో చుక్కలు ఏ చిన్నారికి మిస్‌ కాకుండా ఉండేందుకు ఇంటింటికి వెళ్తున్నామని తెలిపారు. 99.5 శాతం పల్స్‌ పోలియో చుక్కలు వేశామని అన్నారు. మొత్తం 3,845 మంది చిన్నారులు ఉండగా 3,807 మందికి పోలియో చుక్కలు వేశామన్నారు. వీరిలో 38 మంది పిల్లలు రాక పోవడంతో ఇంటింటికి తిరిగి గుర్తించి చుక్కలు వేస్తున్నామని తెలిపారు. సీహెచ్‌వో మెలికమ్మ, ఎంఎల్‌హెచ్‌పీ సుస్మిత, ఏఎన్‌ఎం తిరుమలేశ్వరి తదితరులు పాల్గొన్నారు. 


బనగానపల్లె: బనగానపల్లె మండలంలో వందశాతం పల్స్‌పోలియో చుక్కలు వేసే కార్యక్రమం విజయవంతం అయినట్లు పల్స్‌ పోలియో జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ మోక్షేశ్వరుడు తెలిపారు. సోమవారం పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలను ఆయన పరిశీలించారు. బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాల పరిధిలోను, టంగుటూరు, పలుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వందశాతం పల్స్‌ పోలియో కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. పల్స్‌ పోలియో కేంద్రం సిబ్బంది ఇంటింటికి తిరిగి కార్యక్రమాన్ని విజయవంతం చేశారన్నారు. టంగుటూరు డాక్టర్‌ శివశంకరుడు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-02T04:51:07+05:30 IST